
న్యూఢిల్లీ:శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శుక్రవారం నుంచి నాగ్ పూర్ లో ఆరంభమయ్యే రెండో టెస్టుకు భారత ప్రధాన ఆటగాళ్లు శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ లు దూరమవుతున్నారు. నవంబర్ 23వ తేదీన భువనేశ్వర్ పెళ్లికి సిద్ధం కావడంతో అతన్ని జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. తొలి టెస్టులో ఎనిమిది వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నభువీకి తన ప్రేయసి నుపుర్ నాగర్ ను వివాహం చేసుకోబోతున్నాడు. దాంతో భువీని జట్టు నుంచి రిలేజ్ చేశారు.
మరొకవైపు ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత కారణాలతో రెండో టెస్టుకు దూరం కానున్నాడు. మూడో టెస్టుకు శిఖర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ పేర్కొంది. అయితే భువనేశ్వర్ కుమార్ స్థానంలో తమిళనాడు పేసర్ విజయ్ శంకర్ ను జట్టులోకి తీసుకోనున్నారు.