బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా కన్నుమూత | BCCI president jagmohan dalmia died in kolkata | Sakshi
Sakshi News home page

బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా కన్నుమూత

Sep 20 2015 9:38 PM | Updated on Sep 3 2017 9:41 AM

బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా కన్నుమూత

బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా కన్నుమూత

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) ఆదివారం రాత్రి కన్నుమూశారు.

కోల్ కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన కోల్ కతా లోని బీఎమ్ బిర్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  తుదిశ్వాస విడిచారు. గత గురువారం గుండెపోటు రావడంతో ఆయనను అత్యవసర చికిత్స మేరకు కోలకతాలోని బీ ఎమ్ బిర్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయం విదితమే. దాల్మియాకు భార్య, కుమారుడు అభిషేక్, ఓ కూమార్తె ఉన్నారు.

క్రికెట్ కు దాల్మియా అందించిన సేవలు:

  • బీసీసీఐకి ఆయన 36 ఏళ్లు సేవలు అందించారు.
  • 1978లో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) కోశాధికారిగా దాల్మియా తన కెరీర్ ప్రారంభించారు
  • ఆ తర్వాత 1983 సమయంలో భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కోశాధికారిగా పనిచేశారు.
  • 1987, 1996 వన్డే ప్రపంచ కప్ లు భారత్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు
  • 1997 ఏడాది ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
  • 2001 నుంచి 2004 వరకూ బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement