breaking news
jagmohan dalmia died
-
'భారత క్రికెట్ కు ఆయన మృతి తీరని లోటు'
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) మృతిపట్ల బోర్డు సభ్యులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు దాల్మియా మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కోల్ కతా లోని బీఎమ్ బిర్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. 'దాల్మియాతో నాకు 15 ఏళ్ల అనుబంధం ఉంది. నాతో పాటు చాలా మందికి ఆయన మార్గనిర్దేశకుడు. ఆయన ఆటను ఎంతో ప్రేమించేవారు. దేశానికి చెందిన ఓ గొప్ప క్రికెట్ నిర్వాహకుడిని మనం కోల్పోయాం. భారత క్రికెట్ తో పాటు వ్యక్తిగతంగా నాకూ ఇది తీరని లోటు' అని బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ చీఫ్ మృతిపట్ల సంతాపం తెలిపారు. BCCI condoles the sudden demise of our president Shri Jagmohan Dalmiya — BCCI (@BCCI) September 20, 2015 The greatest sports administrator of India has passed away,an era ends. A personal loss to me & Indian cricket. @BCCI #RIPDalmiyaJi — Anurag Thakur (@ianuragthakur) September 20, 2015 I knew Dalmiya Ji for over 15 years. He was a mentor to us all & a true lover of the game. His guidance & passion was immense. @BCCI — Anurag Thakur (@ianuragthakur) September 20, 2015 -
బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా కన్నుమూత
కోల్ కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన కోల్ కతా లోని బీఎమ్ బిర్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత గురువారం గుండెపోటు రావడంతో ఆయనను అత్యవసర చికిత్స మేరకు కోలకతాలోని బీ ఎమ్ బిర్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయం విదితమే. దాల్మియాకు భార్య, కుమారుడు అభిషేక్, ఓ కూమార్తె ఉన్నారు. క్రికెట్ కు దాల్మియా అందించిన సేవలు: బీసీసీఐకి ఆయన 36 ఏళ్లు సేవలు అందించారు. 1978లో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) కోశాధికారిగా దాల్మియా తన కెరీర్ ప్రారంభించారు ఆ తర్వాత 1983 సమయంలో భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కోశాధికారిగా పనిచేశారు. 1987, 1996 వన్డే ప్రపంచ కప్ లు భారత్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు 1997 ఏడాది ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు 2001 నుంచి 2004 వరకూ బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు