'భారత క్రికెట్ కు ఆయన మృతి తీరని లోటు' | condole for bcci chief jagmohan dalmia death | Sakshi
Sakshi News home page

'భారత క్రికెట్ కు ఆయన మృతి తీరని లోటు'

Sep 20 2015 10:45 PM | Updated on Sep 3 2017 9:41 AM

'భారత క్రికెట్ కు ఆయన మృతి తీరని లోటు'

'భారత క్రికెట్ కు ఆయన మృతి తీరని లోటు'

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) మృతిపట్ల బోర్డు సభ్యులు సంతాపం ప్రకటించారు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) మృతిపట్ల బోర్డు సభ్యులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు దాల్మియా మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కోల్ కతా లోని బీఎమ్ బిర్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.

'దాల్మియాతో నాకు 15 ఏళ్ల అనుబంధం ఉంది. నాతో పాటు చాలా మందికి ఆయన మార్గనిర్దేశకుడు. ఆయన ఆటను ఎంతో ప్రేమించేవారు. దేశానికి చెందిన ఓ గొప్ప క్రికెట్ నిర్వాహకుడిని మనం కోల్పోయాం. భారత క్రికెట్ తో పాటు వ్యక్తిగతంగా నాకూ ఇది తీరని లోటు' అని బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ చీఫ్ మృతిపట్ల సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement