'వర్షాకాలం తర్వాతే దేశంలో క్రికెట్‌ మొదలవ్వొచ్చు'

BCCI CEO States Cricketing Activity In India Can Start After Monsoon - Sakshi

ముంబై : వ‌ర్షాకాలం త‌ర్వాతే దేశంలో మ‌ళ్లీ క్రికెట్ టోర్నీలు ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ రాహుల్ జోహ్రీ తెలిపారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌-2020)ను కూడా నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వెల్లడించారు.  కోవిడ్‌-19 ఆంక్ష‌ల వ‌ల్ల క్రికెట్ టోర్నీలు అన్నీ ర‌ద్దు అయిన విష‌యం తెలిసిందే.  ముంబైలో నిర్వహించిన వెబినార్ స‌మావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ భ‌ద్ర‌త‌ను కోరుకుంటార‌ని, వారిని గౌర‌వించాల‌ని అన్నారు. క్రికెట్ మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ అంశంలో కేంద్ర ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.
(సచిన్‌ నిమ్మకాయలు ఇవ్వవా: భజ్జీ)

'వ‌ర్షాకా‌లం ముగిసాకే క్రికెట్ అధికారికంగా ప్రారంభం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు మ‌న ద‌గ్గ‌ర వ‌ర్షాకాలం ఉంటుంది. ఒక‌వేళ ఆస్ట్రేలియాలో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్‌కప్ వాయిదా ప‌డితే, అప్పుడు అక్టోబ‌ర్ లేదా నవంబ‌ర్‌లో ఐపీఎల్ నిర్వ‌హించే అవకాశాలు ఉంటాయి.  అయితే ఐపీఎల్‌లో ఆడేందుకు అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్లు వ‌స్తుంటార‌ని, వారికి 14 రోజుల క్వారెంటైన్ అవ‌స‌రం ఉంటుంద‌ని, అలాంటి సంద‌ర్భంలో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను షెడ్యూల్ ప్ర‌కారం నిర్వ‌హించే క‌ష్ట‌మే' అంటూ పేర్కొన్నాడు. అంతేగాక దేశవాలి సీజన్‌లో అక్టోబర్‌ నుంచి మే వరకు దాదాపు 2వేల మ్యాచ్‌లు జరగాల్సి ఉందని, వీటిని నిర్వహించడం బీసీసీఐకి ఒక చాలెంజ్‌లా మారే అవకావం ఉన్నట్లు జోహ్రి తెలిపారు. 
(లాక్‌డౌన్‌: విరుష్కల మరో వీడియో వైరల్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top