ఆసీస్‌తో టీమిండియా స్వదేశీ షెడ్యూల్‌ ఇదే..

BCCI Announces Fixtures For Home Series Against Australia - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే నెలలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగునున్న భారత క్రికెట్‌ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌ షెడ్యూల్‌ అధికారికంగా ఖరారైంది. ఈ సిరీస్‌లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య రెండు టీ20ల సిరీస్‌తో పాటు ఐదు వన్డేల సిరీస్‌ జరుగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ వివరాలను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. ఫిబ్రవరి 24వ తేదీన బెంగళూరులో జరిగే తొలి టీ20తో సిరీస్‌ ఆరంభం కానుండగా, ఆపై 27వ తేదీన విశాఖపట్నంలో రెండో టీ20 జరుగనుంది.

మార్చి2వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ ఐదు వన్డేల సిరీస్‌ జరుగనుంది. మార్చి 2న తొలి వన్డే హైదరాబాద్‌లో, 5వ తేదీన నాగ్‌పూర్‌లో రెండో వన్డే, 8వ తేదీన రాంచీలో మూడో వన్డే, 10వ తేదీన మొహాలీలో నాల్గో వన్డే, 13వ తేదీన ఢిల్లీలో ఐదో వన్డేలు జరుగనున్నాయి. ముందుగా ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ జరిగే అవకాశం ఉందని భావించినప్పటికీ, టీ20లతో సిరీస్‌ను ఆరంభించనున్నారు. 2017లో భారత్‌లో చివరిసారి ఆసీస్‌ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ ద్వైపాక్షిక సిరీస్‌లో ఐదు వన్డేల సిరీస్‌తో పాటు, మూడు టీ20ల సిరీస్‌ జరిగింది. ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 4-1తో గెలవగా, టీ20 సిరీస్‌ 1-1తో సమం అయ్యింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top