మొమోటా... పూర్తి ఫిట్‌గా

Badminton World Champion Kento Momota Recovered Totally After Crash - Sakshi

టోక్యో: ఈ ఏడాది ఆరంభంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ కెంటో మొమోటా (జపాన్‌) పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా శుక్రవారం ప్రకటించాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌–500 టోర్నీ విజేతగా నిలిచిన అనంతరం స్వదేశానికి వెళ్లేందుకు కౌలాలంపూర్‌ ఎయిర్‌పోర్టుకు బయలుదేరాడు. అయితే అతడు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవ్వడంతో మొమోటా తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ప్రమాదంలో వ్యాన్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించగా... మొమోటా సిబ్బందికీ గాయాలయ్యాయి. మొమోటా కంటికి గాయం కావడంతో ఫిబ్రవరిలో డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహించారు. ‘ఆడేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చూడగలుగుతున్నా. ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు గతంలో లాగే ఆడుతున్నట్లు అనిపిస్తోంది’ అని మొమోటా అన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గడమే తన  తదుపరి లక్ష్యం అని మొమోటా పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top