'మాకు ధోని లాంటి ఫినిషర్‌ కావాలి'

Australia coach Justin Langer Comments On MS Dhoni About Match Finisher - Sakshi

సిడ్నీ : ఆసీస్‌ జట్టుకు పరిమిత ఓవర్లలో ఎంఎస్‌ ధోని లాంటి ఫినిషర్‌ ఉంటే బాగుంటుందని మాజీ ఆటగాడు, ప్రస్తుత ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పేర్కొన్నాడు. ఇప్పుడు జట్టు మేనేజ్‌మెంట్‌ ధోనీ లాంటి ఫినిషర్‌ కోసమే వెతుకుందని అభిప్రాయపడ్డాడు. 'గతంలో మా జట్టులో మైక్‌ హస్సీ, మైఖేల్ బెవాన్ వంటి ఫినిషర్లు ఉండేవారు. అయితే బెస్ట్‌ ఫినిషర్‌గా మాత్రం ధోనిని మించిన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పటికే ధోని ఎన్నోసార్లు అది రుజువు చేశాడు. ఉదాహరణకు 2011 ప్రపంచకప్‌ చూసుకుంటే మహీ నాలుగో స్థానంలో వచ్చి 90 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాకు కప్‌ను అందించాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌లోనూ జాస్‌ బట్లర్‌ మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఏది ఏమైనా ప్రసుత్తం మా జట్టుకు కూడా ధోని లాంటి ఫినిషర్‌ అవసరం ఉంది. జట్టు ఇన్నింగ్స్‌లో ఐదు, ఆరు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు మంచి ఫినిషర్‌లు అయి ఉండాలి.. అందుకోసం అన్వేషిస్తున్నాం' అంటూ లాంగర్‌ పేర్కొన్నాడు. (పాకిస్తాన్‌లో ధోని ఫీవర్‌!)

​కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్‌ ఆతిథ్య జట్టుకు క్లీన్‌స్వీప్‌తో సమర్పించేసుకుంది. కాగా సరైన ఫినిషర్‌ లేకనే జట్టు ఓటమి పాలయిందని పలువురు ఆసీస్‌ మాజీ క్రికెటర్లు తెలిపారు. అయితే ప్రొటీస్‌తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో మిచెల్‌ మార్ష్‌ ఆరవ స్థానంలో వచ్చి 32, 36 పరుగులు సాధించాడు. తాజాగా మార్చి 13 నుంచి కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. కాగా ఆసీస్‌ తరపున టెస్టు ఓపెనర్‌గా ప్రాతినిథ్యం వహించిన జస్టిన్‌ లాంగర్‌ 105 టెస్టుల్లో 7696 పరుగులు, 8 వన్డేల్లో 160 పరుగులు చేశాడు. కాగా మాథ్యూ హెడెన్‌తో కలిసి ఆసీస్‌కు టెస్టుల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు.(హోలీ శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా క్రికెటర్లు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top