హోలీ శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా క్రికెటర్లు

Indian Team Cricketers Celebrate Holi Festival - Sakshi

దేశవ్యాప్తంగా  హోలీ పండగను మంగళవారం ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.  అయితే కరోనా వైరస్‌ ప్రభావంతో ఎక్కువగా సహజ సిద్ధమైన రంగులనే  ఉపయోగిస్తున్నారు. ఇక ఈ వైరస్‌ కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సారి హోలీ జరుపుకోవడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా టీం ఇండియా క్రికెటర్లు సైతం హోలీ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

‘ప్రతి ఒక్కరూ ఆనందంగా, సురక్షితంగా హోలీని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ హోలీ మీ జీవితాల్లో ఎన్నో రంగులు నింపాలని కోరుకుంటున్నాను’ అంటూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఆల్‌ రౌండర్‌ హర్దిక్‌ పాండ్యా తన ప్రేయసి నటాషా, సోదరుడు కృనాల్‌ పాండ్యాతో కలిసి హోలీ వేడుక చేసుకున్నారు. ‘ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు’ అని సచిన్‌ టెండుల్కర్‌ పేర్కొన్నాడు. వీరితో పాటు వీవీఎస్‌ లక్ష్మణ్‌, సచిన్‌ టెండూల్కర్‌, హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top