కోహ్లి కోసం మామగారి స్పెషల్‌ గిఫ్ట్‌ | Anushka Sharmas father gifts son in law Virat Kohli a book on relationships | Sakshi
Sakshi News home page

కోహ్లి కోసం మామగారి స్పెషల్‌ గిఫ్ట్‌

Feb 9 2018 3:53 PM | Updated on Feb 9 2018 4:05 PM

Anushka Sharmas father gifts son in law Virat Kohli a book on relationships - Sakshi

ముంబై: సుమారు రెండు నెలల క్రితం భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌​ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటనలో బిజీగా ఉండగా, అనుష్క తన సినిమా పనుల్లో హడావుడిగా ఉంది. ఇదిలా ఉంచితే, అనుష్క తండ్రి అజయ్‌ కుమార్‌.. తన అల్లుడు కోహ్లికి ఒక ప్రత్యేకమైన కానుక ఇచ్చారు. విరాట్‌కి కవితలంటే చాలా ఇష్టం. దాంతో ప్రముఖ రచయిత్రి తేజశ్విని దివ్యా నాయక్‌ రచించిన 'స్మోక్స్‌ అండ్‌ విస్కీ' అనే పుస్తకాన్ని అజయ్‌ విరాట్‌కి కానుకగా ఇచ్చారు.

ఇందులో రిలేషన్‌షిప్‌కు సంబంధించిన 42 రచనలు ఉన్నాయి. గురువారం ముంబయిలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో భాగంగా  ఒక కాపీని దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న అల్లుడు కోహ్లికి పంపిచారట మామ అజయ్‌. మరి మామ ఇంత ప‍్రేమగా పంపించిన గిఫ్ట్‌ కోహ్లికి ఎంతవరకూ నచ్చుతుందో చూద్దాం.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement