కోహ్లి సెంచరీకి అనుష్క ఫిదా | Anushka Sharma cheers for Virat Kohli as he scores a ton | Sakshi
Sakshi News home page

Feb 2 2018 3:40 PM | Updated on Feb 2 2018 4:47 PM

 Anushka Sharma cheers for Virat Kohli as he scores a ton - Sakshi

అనుష్కా శర్మ, విరాట్‌ కోహ్లి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో భారత్‌కు చిరస్మరణీయమైన విజయం అందించాడు. అయితే ఈ సెంచరీ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్కా శర్మ ఫిదా చేసింది. సెంచరీ సాధించిన వెంటనే సోషల్‌ మీడియా వేదికగా ఆమె ఆనందాన్ని తెలియజేసింది. కోహ్లి ఫొటోపై లవ్‌ సిబల్స్‌తో పోస్ట్‌ చేసింది.

అనంతరం మరో ఫొటోపై వాట్‌ ఏ గయ్‌ అంటూ మురిసిపోయింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లి 112 పరుగులకు తోడు అజింక్యా రహానే79 పరుగులు తోడవ్వడంతో భారత్‌  సిరీస్‌లో తొలి  విజయం సాధించింన విషయం తెలిసిందే. ఇక ఈ విజయంపై భారత్‌ మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. 

‘సిరీస్‌లో ఇది అద్భుతమైన ఆరంభం.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో గొప్ప విజయం సాధించారు. పరుగుల యంత్రం కోహ్లి నుంచి మరో గొప్ప శతకం, అజ్జు నుంచి సూప్‌ర్‌ ఇన్నిం‍గ్స్‌.. ఇలానే కొనసాగించండి బాయ్స్‌’ అంటూ రైనా ట్వీట్‌ చేశాడు. కింగ్‌ ఆఫ్‌ చేజింగ్‌ మాస్టర్‌ కోహ్లి 33వ సెంచరీ.. అంటూ కైఫ్‌ కొనియాడాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement