
జాతీయ సీనియర్ పురుషుల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ స్వర్ణ పతక పోరుకు అర్హత
సాధించాడు. విశాఖపట్నంలో శనివారం జరిగిన 49 కేజీల విభాగం సెమీఫైనల్లో శ్యామ్ కుమార్ 5–0తో విపిన్ కుమార్ (చండీగఢ్)పై గెలిచాడు. ఫైనల్లో ఎన్టీ లాల్‌బియకిమా (మిజోరం)తో శ్యామ్ తలపడతాడు. ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ బాక్సర్లు మనోజ్ కుమార్ (69 కేజీలు), మన్‌దీప్ జాంగ్రా (75 కేజీలు), శివ థాపా (60 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు.