
బాతు పిల్లలకి ఎస్కాట్‌గా పోలీసు ఆఫీసర్ ఉండటం మీరెక్కడైనా చూశారా? అలాంటి ఒక విషయం టెక్సాస్‌లోని హౌస్టన్ మెమోరియల్ పార్క్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్లితే మెమోరియల్‌పార్క్‌లో 6 బాతు పిల్లలు మా అమ్మ కనిపించడం లేదు, చూపించరా అన్నట్లు ఒక పోలీసు ఆఫీసర్ వెంట వరుసగా నడుచుకుంటూ వెళ్లాయి. అతను వాటికి అమ్మను చూపించడానికి సరస్సు వైపు వెళితే అవి కూడా అతనితో పాటు అవే మార్గంలో వెళ్లాయి. (కనువిందు చేస్తున్న వింత స్నేహం!)
ఈ వీడియోని హౌస్టన్ పోలీసు డిపార్ట్‌మెంట్ వారి ఫేస్‌బుక్ ఖాతలో పోస్ట్ చేశారు. అసిస్టెంట్ చీఫ్ లారీ స్టార్‌వైట్ బాతు పిల్లలకు ఎస్కాట్‌గా మారి వాళ్ల అమ్మను కనుగోవడానికి సహాయపడ్డారు. గుర్తుపెట్టుకొండి,ఈ సమయంలో పార్క్ మూసివేయబడి ఉన్నది. హౌస్టన్ పార్క్‌కి సంబంధించిన అన్ని విషయాలు కంట్రోల్‌లో ఉన్నాయి అనే క్యాప్షన్‌తో వీడియోని పోస్ట్ చేశారు. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తూ వైరల్‌గా మారాయి. ఈ వీడియో పై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాతుపిల్లలకు వాళ్ల అమ్మను కనుగొనడంలో సాయపడి మంచి పని చేశారు అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.