కనువిందు చేస్తున్న విచిత్ర బంధం! | horse and doggo duo are unlikely friendship goals | Sakshi
Sakshi News home page

కనువిందు చేస్తున్న వింత స్నేహం!

Apr 3 2020 12:28 PM | Updated on Apr 3 2020 1:35 PM

horse and doggo duo are unlikely friendship goals - Sakshi

గుర్రం, కుక్కల స్నేహం గురించి మనం ఏ కథల పుస్తకంలోనో, సినిమాల్లోనో చూస్తాం. కానీ నిజంగానే గుర్రం, కుక్కలు ఒకదానినొకటి ముద్దాడుకుంటున్న వీడియో ఒకదానిని యానిమల్స్‌ బీయింగ్‌ బ్రోస్‌ అనే బ్లాగ్‌ వారు గుర్రం, కుక్క బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటూ  పోస్ట్‌ చేశారు.  ఈ వీడియోలో గుర్రం కుక్కకు వేసిన టీషర్ట్‌ని పట్టుకొని లాగుతుంది. కుక్క వెంటనే గుర్రానికి దగ్గరగా వచ్చి దాన్ని ముద్దాడుతుంది. 14 సెకన్ల నిడివిగల ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఇలాంటి అద్భుతమైన జంటను చూసి నెటిజన్లు  వాళ్లకు తోచినట్లు స్పందిస్తున్నారు. 

ఒకతను   నిజంగా గుర్రం కుక్కను పైకి లాగుతుందనుకున్నాను అని కామెంట్‌ చేశాడు. మరో నెటిజన్‌ దీనిపై స్పందిస్తూ గుర్రం, కుక్కకి ఆయా(సంరక్షకురాలు) లాంటిదని కామెంట్‌ చేశాడు. మరో వ్యక్తి ఈ రెండింటికి మంచి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉందని చెప్పండి అని కామెంట్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకి 200కి పైగ కామెంట్స్‌ రాగా, లక్ష డైబ్బైవేల మందికి పైగ  వీక్షించారు. 

ఇది చదవండి: వైరల్‌ : కుక్క కోసం కొండచిలువతో పోరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement