డెలివరీ బాయ్స్‌ను ఇలా కూడా వాడుకుంటారా ? | Delivery Man Could Get Rid Of Spider At Home | Sakshi
Sakshi News home page

Jun 4 2018 5:36 PM | Updated on Oct 22 2018 6:10 PM

Delivery Man Could Get Rid Of Spider At Home - Sakshi

సాలీడులు తొలిగిస్తున్న డెలివరీబాయ్‌

మనసుంటే మార్గం ఉంటుందంటారు పెద్దలు. ఇలానే ఓ యువతి వినూత్నంగా తన సమస్యను పరిష్కరించుకొని అందరి చేత శభాష్‌ అనిపించుకుంది. సాధారణంగా బల్లులు, సాలీడులు, బొద్దింకలు ఇంట్లో కనిపిస్తే చాలు ప్రాణాలు పోయేంత పనిచేస్తారు మహిళలు. ఇలానే డెమీ అనే యువతికి తన ఇంట్లో సాలీడులు కనిపించాయి. అవి చూస్తే ఆమెకు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండబుద్ది కాలేదు. ఇంట్లో ఎవరు లేరు.. వాటిని తీసేంత ధైర్యం లేదు. ఏం చేయాలి మరీ ఆలోచిస్తుండగా.. ఒక ఆలోచన తట్టింది. ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే.. డెలివరి బాయ్‌ సలహా తీసుకొవచ్చు అనుకుంది.

వెంటనే ఫుడ్‌ ఆర్డర్‌ చేయగా.. డెలివరీ  బాయ్‌ వచ్చాడు. ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ తీసుకొచ్చిన బాయ్‌ ఏమైన సాయం కావాలా మేడమ్‌ అని అడిగాడు. ఆ మాటకు తనలో తాను నవ్వుకున్న డెమీ తన సమస్యను వివరించి సాయం కోరింది. ఆ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ హెల్మెట్‌ పెట్టుకుని మరీ సాలీడులను తొలిగించాడు. ఈ తతంగాన్ని ట్విటర్‌లో పంచుకుంటూ డెమీ ఉబ్బితబ్బిబ్బయింది. అంతేకాదండోయ్‌ ఈ ట్వీట్‌కు సదరు డెలివరీ కంపెనీ సైతం స్పందిస్తూ ఆ బాయ్‌ని ప్రశంసించింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌లు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ బాయ్‌కు మంచి టిప్‌ ఇచ్చావని భావిస్తున్నామని కొందరు.. డెలివరీ బాయ్స్‌ను ఇలా కూడా వాడుకోవచ్చా అని ఇంకొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement