'అలా అనడం చంద్రబాబుకు సిగ్గు చేటు'

YSRCP leaders takes on cm chandrababu naidu - Sakshi

సాక్షి, విజయవాడ : విభజన హామీలు నెరవేర్చనందుకు ప్రధాని నరేంద్రమోదీపై కోర్టుకు వెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం చాలా సిగ్గు చేటు అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్రంలో టీడీపీ మంత్రులు ఇద్దరు ఉన్నారని వారు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. స్వలాభం కోసమే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని అన్నారు.

వైఎస్‌ఆర్‌ పేరు చెబితే వణుకు : అవినాష్‌ రెడ్డి
వైఎస్‌ఆర్‌ పేరు చెబితేనే చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అవినాష్‌ రెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి వైఎస్‌ఆర్‌ అని చెప్పారు. వైఎస్‌ఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు చెబుతుంటే చంద్రబాబు మైకు లాగేసుకుంటున్నారని మండిపడ్డారు.

హంద్రీనీవాపై చిత్తశుద్ధి లేదు : విశ్వేశ్వరరెడ్డి
హంద్రీనీవాను పూర్తి చేసే చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చంద్రబాబు ఆయన మంత్రులు కలిసి హంద్రీనీవాను దోపిడీ ప్రాజెక్ట్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు. డిస్టిబ్యూటరీ పనులు నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top