‘ఉమ అవినీతిపై పూర్తి ఆధారాలు ఉన్నాయి’

YSRCP Leader Vasantha krishna Prasad Fires On Devineni Uma Over CAG Report - Sakshi

సాక్షి, విజయవాడ : పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిపై కాగ్‌ నివేదిక నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్‌ అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన... ప్రతీ విషయానికి స్పందించే ఉమా కాగ్‌ నివేదికపై ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. తెలంగాణలో హరీశ్‌ రావు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఉమా మాత్రం హడావుడి చేస్తూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రతీ సోమవారం పోలవరం వెళ్లి కమీషన్లు తీసుకోవడమే ఉమా లక్ష్యమని ఆరోపించారు. అసమర్థ సాగునీటి మంత్రి ఉమా అని.. కమీషన్ల కోసం తాపత్రయపడటమే ఆయన పని అంటూ కృష్ణ ప్రసాద్‌ విమర్శించారు.

రమేశ్‌బాబుకు ఎలా ఇచ్చారు?
పోలవరం సీఈ రమేశ్‌ బాబు తెలంగాణ వ్యక్తి అని, ఏమాత్రం అనుభవం లేని అటువంటి వ్యక్తికి ఇంతపెద్ద ప్రాజెక్టు ఎలా అప్పజెప్పారని కృష్ణ ప్రసాద్‌ ప్రశ్నించారు. రమేశ్‌ బాబు, ఉమా మధ్య ఉన్న బంధం ఏమిటో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. పోలవరం అవినీతిపై వచ్చే వారం లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుని సోమవారం లేదా మంగళవారం ఉమా అవినీతిపై ఫిర్యాదు చేస్తానన్నారు. ఉమా అవినీతిపై పూర్తి ఆధారాలున్నాయని, అవన్నీ సీబీఐకి అప్పగిస్తానని కృష్ణ ప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై సమగ్ర విచారణ జరిగితే దేవినేని ఉమ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top