ఇడుపులపాయకు బయల్దేరిన వైఎస్‌ జగన్‌

YS Jagan Starts To Idupulapaya To Announce Contestants List - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ నుంచి ఇడుపులపాయకు బయలుదేరారు. అక్కడ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఉదయం 10 గంటలకు విడుదల చేసి ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుడతారు.

ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసే 9 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. మిగిలిన 16 ఎంపీ స్థానాలకు 175 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో 12.30 గంటలకు ఎన్నికల తొలి బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ బహిరంగ సభ, సాయంత్రం 4.30 గంటలకు తూర్పుగోదావరి జిల్ల పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట బహిరంగ సభల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top