ప్రజాసంకల్పయాత్రలో మరో కీలక ఘట్టం

Ys Jagan Praja SankalpaYatra Reaches 3600 Kms Milestone - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ప్రజాసంకల్పయాత్ర మరో కీలక ఘట్టానికి చేరుకుంది. అలుపెరుగుని పాదయాత్రికుడు మరో చరిత్రకు నాంది పలికారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి అరాచక పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గత ఏడాది కాలంగా చేస్తున్న ప్రజాసంకల్పయాత్రలో శనివారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

ప్రజాసంకల్పయాత్ర@3600 : వెల్లువలా జనం వెంటనడువగా... శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని బారువ జంక్షన్‌ వద్ద వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 3600 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా జననేత.. ఈ మైలురాయికి గుర్తుగా వేప మొక్కను నాటి, పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కీలక ఘట్టంలో భాగమయ్యేందుకు ప్రజలు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు జననేత అడుగులో అడుగేశారు. శనివారం ఉదయం వైఎస్‌ జగన్‌ సోంపేట మండలంలోని తురకశాసనం నుంచి 337వరోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి రాజన్నతనయుడి పాదయాత్ర  పాలవలస, కొర్లాం మీదుగా బారువ కూడలి వరకు కొనసాగింది. అక్కడి నుంచి లక్కవరం చేరుకోగానే నేటి పాదయాత్ర ముగుస్తోంది. జనం మద్దతుతో దిగ్విజయంగా ముందుకు సాగుతున్న  జగన్‌ పాదయాత్ర.. 9న ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో ముగియనుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top