
శుక్రవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని సగుటూరు గ్రామంలో జెండా వందనం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి, హైదరాబాద్/విజయవాడ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలం సగుటూరు గ్రామంలో గణతంత్రదిన వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర ఓజిలి మండలం సగుటూరులో గురువారం ముగిసింది. రాత్రి ఆయన బసచేసిన క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన గణతంత్రదిన వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొని జాతీయజెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేడుకల్లో పాల్గొన్న చిన్నారులతో జగన్ ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి, నెల్లూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నాయకుడు పేర్నేటి శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉత్సవాలు
హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ దినోత్సవాల్లో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున, పార్టీ నేతలందరి తరఫునా భారతీయులకు, ఎన్‌ఆర్‌ఐలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఉమ్మారెడ్డి అన్నారు. ఈ ఉత్సవాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, పీఎన్‌వి ప్రసాద్, పార్టీ నేతలు కరణం ధర్మశ్రీ, వాసిరెడ్డి పద్మ, వైఎస్ వివేకానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, టీజీవీ కృష్ణారెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, రొంగలి జగన్నాథం, చల్లా మధుసూదన్‌రెడ్డి, హర్షవర్థన్, కాకుమాను రాజశేఖర్‌తో సహా పలువురు పాల్గొన్నారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలోనూ గణతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతోనే పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారన్నారు.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరిస్తున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.
చిత్రంలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైఎస్ వివేకానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు