సీఎం వైఎస్‌ జగన్‌ షెడ్యూల్‌ ఇలా...

YS Jagan To Enter Into AP Secretariat First Time  - Sakshi

సాక్షి, అమరావతి :ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టారు. సచివాలయంలోని తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల సీఎం కార్యాలయంలోకి ముఖ్యమంత్రి శనివారం ఉదయం 8.39 గంటలకు ప్రవేశించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

అంతకు ముందు ముఖ్యమంత్రికి ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 8.15 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బయల్దేరారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వెంటనే సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశం అయ్యారు.  సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన అప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరవుతారు.

ముఖ్యమంత్రి షెడ్యూల్‌ వివరాలు:
ఉదయం 8.15 కి తాడేపల్లి నివాసం నుంచి సెక్రటేరియట్‌కు సీఎం జగన్‌
8.35 కి సచివాలయానికి ముఖ్యమంత్రి...
8.39 కి సచివాలయంలో తన ఛాంబర్ లో అడుగు పెట్టిన సీఎం...
8.50 కి మొదటి సంతకం చేయనున్న సీఎం జగన్..
9.10 కి ఉద్యోగ సంఘాల సన్మానం..
10 గంటలకు కార్యదర్సలు,శాఖాధిపతులతో తొలి సమావేశం..
10.50 కి ఉద్యోగులనుద్దేశించి మాట్లాడనున్న సీఎం..
11.15 కి గవర్నర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం..
11.42 కి మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరు..
మధ్యాహ్నం ఒంటి గంటకు హై టీ తో ముగియనున్న కార్యక్రమం..

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top