220వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Jagan Day 220 Praja Sankalpa Yatra Begins | Sakshi
Sakshi News home page

220వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Jul 25 2018 8:18 AM | Updated on Jul 26 2018 7:22 PM

YS Jagan Day 220 Praja Sankalpa Yatra Begins - Sakshi

సాక్షి, సామర్లకోట(తూర్పుగోదావరి జిల్లా) : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 220వ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురం నియోజకర్గంలోని సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్‌ నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి రాజన్న తనయుడు ముందుకు సాగుతున్నారు. అడుగడుగా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.

పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైఎస్‌ జగన్‌కు స్థానికులు సమస్యలు విన్నవించుకుంటున్నారు. పెద్దాపురం పట్టణంలోని బ్యాంక్‌ కాలనీ, మున్సిపల్‌ సెంటర్‌, పాత బస్టాండ్‌ సెంటర్‌, మరిడమ్మ తల్లి గుడి, వేములవారి సెంటర్‌, దర్గా సెంటర్‌ వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సాయంత్రం పెద్దాపురం వేములవారి సెంటర్‌లో నిర్వహించే బహిరం‍గ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement