అక్రమ కేసులన్నీ ఎత్తేస్తాం : హోంమంత్రి సుచరిత

We Will Lift All Illegal Cases Booked By TDP Govt Home Minister Mekathoti Sucharitha Says - Sakshi

సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయంలో ముస్లిం యువకులు, ప్రత్యేక ఉద్యమ కారులపై పెట్టిన అక్రమ కేసులన్నింటిపైనా విచారణ జరిగి ఎత్తివేస్తామని ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బుధవారం ఆమె సచివాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం చాలా మందిపై అక్రమంగా రౌడీ షీట్లు తెరిచి వేధించారని ఆరోపించారు. చంద్రబాబు సభలో నినాదాలు చేశారని ముస్లిం యువకులపై దేశ ద్రోహ కేసులు పెట్టారన్నారు. ఈ విషయాన్ని ముస్లిం యువకులు తమ ప్రభుత్వ దృష్టికి తీసుకురాగా, విచారణలో అవి అక్రమ కేసులని తేలిందన్నారు. అందుకే 9 మంది యువకులపై ఉన్న కేసులను ఉపసంహరించుకున్నామని తెలిపారు. సోషల్‌ మీడియా వారిపై కూడా అక్రమ కేసులు పెట్టారని, వీటన్నింటిపైనా విచారణ జరిపి ఎత్తివేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top