టీఆర్ఎస్‌ నుంచి హరీష్‌రావు వచ్చినా ఆహ్వానిస్తాం: డీకే అరుణ | we welcome harish rao in congress, says dk aruna | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్‌ నుంచి హరీష్‌రావు వచ్చినా ఆహ్వానిస్తాం: డీకే అరుణ

Oct 29 2017 7:58 PM | Updated on Mar 18 2019 9:02 PM

we welcome harish rao in congress, says dk aruna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కుంతియాతో భేటీ ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరో వారం, పది రోజుల్లో కాంగ్రెస్‌లోకి భారీగా వలసలుంటాయని, వారందరికీ స్వాగతం పలుకుతామని ఆయన రేవంత్‌రెడ్డి రాకను ఉదహరిస్తూ.. చెప్పారు. ఇక, హైకమాండ్ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పారు.

రేవంత్ రెడ్డి పార్టీలోకి వస్తారన్న ఊహాగానాలపై ఆమె తనదైన శైలిలో బదులిచ్చారు. రేవంతే కాదు చివరకు టీఆర్ఎస్‌ నుంచి హరీష్‌రావు వచ్చినా ఆహ్వానిస్తామని ఆమె చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి రాక పట్ల ఎమ్మెల్యే డీకే అరుణ అసంతృప్తితో ఉన్నట్టు ఇంతకుముందు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లోకి రేవంత్‌ రాకను ఎవరూ వ్యతిరేకించడం లేదని తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ కుంతియ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. డీకే అరుణతో ఇప్పటికే మాట్లాడానని, పెద్ద వ్యతిరేకత లేదని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement