టీడీపీ స్పెషల్‌ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ

Vijaya Sai Reddy Reveals BJP And TDP Secret Relation - Sakshi

బీజేపీ-టీడీపీ కాపురం గుట్టు రట్టు

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ-టీడీపీ రహస్య కాపురం గుట్టు రట్టైంది. పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రైవేట్‌గా కొనసాగిస్తున్న ప్రేమాయాణాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా బయట పెట్టారు. ధర్మపోరాట దీక్ష కోసం ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షమయ్యారు. ఈ ఫొటోలను విజయసాయిరెడ్డి షేర్‌ చేస్తూ బీజేపీ-టీడీపీ అక్రమ సంబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన ట్విటర్‌ వేదికగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ తీరును ఎండగట్టారు.

బాబు.. ప్రజలు గమనిస్తున్నారు
ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ధర్మపోరాట దీక్షలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు రూ. 200 కోట్ల ప్రజాధనాన్ని తిరిగి చెల్లించక తప్పదన్నారు. ఎవరి సొమ్మని పచ్చ కుల మీడియాకు వేల కోట్లు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. సొంత పనులకు హెలికాప్టర్‌, విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చిరించారు.

మరో ట్వీట్‌లో  లోకేష్‌ బాబుకి ఇండిపెండెన్స్‌ డేకు రిపబ్లిక్‌ డేకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టినా చంద్రబాబుకూ చిట్టి నాయుడిపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. అందుకే తెలంగాణా ఎన్నికల్లో సరిహద్దు దాటకుండా గీత గీశాడని గుర్తు చేశారు. కానీ దోచుకోవడంలో మాత్రం లోకేష్‌ తండ్రి శిక్షణలో రాటు తేలాడని, ఇందులో A గ్రేడ్ ఇవ్వక తప్పదని అభిప్రాయపడ్డాడు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top