అప్పుడే మళ్లీ ఓట్లు అడుగుతాం: రజని

Vidadala Rajini Slams Chandrababu Over His Allegations On Liquor Policy - Sakshi

సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు మాట్లాడే అబద్ధాలు చూసి అబద్ధం అనే మాట కూడా సిగ్గుపడుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విడదల రజని అన్నారు. గాంధీ జయంతి రోజున కూడా చంద్రబాబు అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. గాంధీ జయంతి రోజున మద్యం అమ్మారని అసత్యాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు.. మద్యం ఎక్కడ అమ్మారో చూపాలంటూ సవాల్‌ విసిరారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులను రద్దు చేశారని తెలిపారు. మొత్తంగా 20 శాతం మద్యం షాపులు తగ్గించారన్నారు. ప్రమాణ స్వీకారం రోజున బెల్టుషాపులు రద్దు చేస్తామని చెప్పి సంతకం చేసిన చంద్రబాబు మాట తప్పారని.. ఆయన హయాంలో మద్యం ఏరులై పారిందని మండిపడ్డారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగేవని విమర్శించారు. లేనిది ఉన్నట్లుగా ఎందుకు బాబు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న బాబు పనికొచ్చే మాటలు మాట్లాడాలన్నారు. ఇంట్లో టైంపాస్‌ కాక ప్రభుత్వంపై ఏదో ఒక బురదజల్లాలని మాట్లాడుతున్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని ఆమె చెప్పారు. ప్రజారంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మంచిపేరు రావడం చూసి ఓర్వలేక చంద్రబాబు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

బాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి...
హైటెక్ చంద్రబాబుకు మహిళల సమస్యలు ఏం తెలుసని ఎమ్మెల్యే రజని నిలదీశారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలోని 43 వేల బెల్టుషాపులు మూతపడ్డాయని తెలిపారు. 40,380 పర్మిట్‌ రూంల లైసెన్స్‌లు కూడా రద్దయ్యాయని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం బెల్ట్‌షాపులు రద్దు చేశారన్నారు. దశలవారి మద్య నిషేధ పథకంలో భాగంగా 20 శాతం దుకాణాలను కూడా సీఎం తగ్గించారని గుర్తుచేశారు. కానీ, చంద్రబాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ వ్యాపారాల ద్వారా 40,380 మద్యం దుకాణాలు వెలిస్తే వాటికి అనుబంధంగా 43 వేల బెల్టుషాపులు పుట్టుకొచ్చాయన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కు మంచిపేరు రావడం చూచి ఓర్వలేక చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి ప్రభుత్వం కష్టపడుతుందన్నారు. చేతనైతే మంచి పనులు చేస్తున్న సీఎంను అభినందించాలి కానీ, లేనిపోని విమర్శలు చేయడం తగదని చంద్రబాబుకు హితవు పలికారు. మద్యపాన నిషేధమే మా లక్ష్యం అని చెప్పారు. మద్య నియంత్రణ చేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న చంద్రబాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విడదల రజిని కోరారు. అదే విధంగా గ్రామ సచివాలయాలను తీసుకురావాలని భావించిన గాంధీ సిద్ధాంతాన్ని అక్టోబరు 2న సీఎం జగన్‌ అమలు చేసి గాంధీజీకి ఘనమైన నివాళులర్పించారన్నారు. సచివాలయ వ్యవస్థలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం తట్టుకోలేక ప్రభుత్వంపై బాబు విషప్రచారం చేస్తున్నారన్నారు. గాంధీజీవి సత్యం, అహింస మార్గాలు అయితే.. చంద్రబాబుది అసత్యం, హింసామార్గమని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారు పనికొచ్చే మాటలు మాట్లాడాలని చెప్పారు. ఇప్పటికైనా వైఖరి మానుకొని అవగాహన చేసుకొని చంద్రబాబు మాట్లాడాలని చెప్పారు.

అప్పుడే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం..
హైటెక్ చంద్రబాబుకు మహిళ సమస్యలు ఏం తెలుసు. సీఎం జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం బెల్ట్‌షాపులు రద్దు చేశారు. ప్రభుత్వం దశల వారీగా మద్యనియంత్రణ చేస్తోంది. మద్యపాన నిషేధమే మా లక్ష్యం. మద్య నియంత్రణ చేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాము. ప్రభుత్వ విధానాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న చంద్రబాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి’ అని విడదల రజిని కోరారు. అదే విధంగా  గ్రామ సచివాలయాలను తీసుకురావాలని భావించిన గాంధీ సిద్ధాంతాన్ని అక్టోబరు 2న సీఎం జగన్‌ అమలు చేశారని ప్రశంసించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top