
సాక్షి, సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డుల వారీగా రిజర్వేషన్ ఖరారు చేయడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే భయం లేదని ఆయన అన్నారు. ఆదివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే, హడావిడిగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను చేపట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదో తేదీన రిజర్వేషన్లు ఖరారు చేసి.. ఆరో తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం.. ఎనిమిదో తేదీన నామినేషన్లు స్వీకరించడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ఈ విషయమై మరింత గడువు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.
చదవండి: తెలంగాణలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు