ఢిల్లీ చేరుకున్న కేసీఆర్‌

Telangana CM KCR Reached Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. కేసీఆర్‌తోపాటు సీఎస్‌ ఎస్‌కే జోషి, పలువురు టీఆర్‌ఎస్‌ సీనియర్లు కూడా ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయనే వార్తల నేపథ్యంలో కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పాటు కేసీఆర్‌ ఢిల్లీలోనే ఉండనున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. 

కేసీఆర్‌ శనివారం సాయంత్రం 4-5 గంటల మధ్య మోదీతో భేటీ కానున్నట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. కొత్త జోన్ల ఏర్పాటు, పలు పెండింగ్‌ అంశాలు కూడా వీరిద్దరి భేటీలో చర్చకురానున్నాయి. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top