టీడీపీ ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాలి | TDP MP Kesineni Nani Should Say Sorry Over Degrading Nai Brahmans | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాలి

Nov 1 2019 8:42 AM | Updated on Nov 1 2019 8:42 AM

TDP MP Kesineni Nani Should Say Sorry Over Degrading Nai Brahmans - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న దాస్యం ప్రసాద్‌

సాక్షి, సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నాయీ బ్రాహ్మణ కులాన్ని కించపరిచేలా మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే నాయీబ్రాహ్మణుల సత్తా చూపిస్తామని ఆ సంఘ నాయకులు హెచ్చరించారు. స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్‌ మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించిన కేశినేనికి ఇదేమీ కొత్త కాదన్నారు. గతంలో గుంటూరులో ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌పై దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించారన్నారు. బాధ్యత గల ఎంపీ పదవిలో ఉండి ఒక కులాన్ని కించపరిచేలా మాట్లాడడం అహంకారపూరితమన్నారు. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలన్నారు. నగర నాయీబ్రాహ్మణ గౌరవ అధ్యక్షుడు అందనాపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో నాయీ బ్రాహ్మణులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ మీ తోకలు కట్‌ చేస్తాను, గుడి మెట్లు కూడా ఎక్కనివ్వను’ అని బెదిరించారన్నారు. కార్యక్రమంలో చిట్టాబత్తుల నాగబాబు, కందికొండ రమేష్, అలజంగి దేవుడు, అప్పారావు పాల్గొన్నారు.  

 

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement