మండలిలో జరిగిన ఘటన బాధాకరం : టీడీపీ ఎమ్మెల్సీ

TDP MLC Pothula Suneetha Support To Three Capital Plan - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు తాను మద్దతు ఇస్తానని చెప్పారు. గురువారం ఆమె ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరడానికే సీఎం జగన్‌ను కలిశానని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

బుధవారం శాసన మండలిలో జరిగిన ఘటన దేశం మొత్తం పరిశీలించిందని, అలా జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ బిల్లులు అడ్డుకున్నారని ఆరోపించారు. మండలి చైర్మన్‌ టీడీపీ కార్యకర్తగా వ్యవహరించారని విమర్శించారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న శాసస మండలి ఉండాలా వద్దా అనే అంశంపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్ధేశంతో రూల్‌ 71ను టీడీపీ పెట్టిందని, అందుకే వ్యతిరేకంగా ఓటు వేశానని అన్నారు. 

కాగా, ఏపీ శాసన మండలిలో మంగళవారం టీడీపీ ప్రవేశపెట్టిన రూల్‌ 71ను సునీత వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్‌రెడ్డి  కూడా సొంత పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top