రామగిరిలో ప్రలోభాల పరంపర

In TDP MLA Candidate Paritala Sreeram Constituency Wine Distributing To Voters - Sakshi

ఓటర్లకు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ

సాక్షి, రామగిరి: రాప్తాడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ సొంత మండలమైన రామగిరిలో ప్రలోభాలకు గురిచేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆపార్టీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆపార్టీ నాయకులు మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో మద్యం ఏరులై పారిస్తున్నారు. మొదటిసారిగా రాప్తాడు అసెంబ్లీ సార్వత్రిక బరిలో పరిటాల శ్రీరామ్‌ నిలిచారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీకి పరాభవం తప్పదన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో ఎలాగైనా గెలవాలని పథకం రచించినట్లు తెలుస్తోంది.

ఓటుకు రూ. 2వేల నుంచి రూ.3వేల దాకా ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నట్లు స్థానిక నాయకులే బహిరంగంగా చెప్తున్నారు. ఈక్రమంలో కింది స్థాయి అధికారులను సైతం వారు వినియోగించుకుంటూ టీడీపీకి ప్రచారం చేయించుకుంటున్నారు. అందులో భాగంగా గత వారంలో తిమ్మాపురానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తతో ప్రచారం చేయించారు. బుధవారం పోలేపల్లి గ్రామంలో బీఎల్‌ఓ నిర్మల భర్త మక్కిన నారాయణ స్లిప్పులతోపాటు డబ్బులు పంపిణీ చేశారు.  

మద్యం బాటిళ్లు స్వాధీనం 
ధర్మవరం రూరల్‌: గొళ్లపల్లి వద్ద బుధవారం ఎక్సైజ్‌ శాఖ జరిపిన తనిఖీలలో శ్రీనివాసులు అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసి, అతని వద్ద నుంచి 38 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరసానాయుడు తెలిపారు. మద్యాన్ని తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్‌ చేశామన్నారు. ఈ దాడులలో ఎస్‌ఐలు ఎస్‌ఎం రఫీ, మోహన్‌బాబు, సిబ్బంది రామాంజులు, సుధాకర్‌రెడ్డి, కృష్ణానాయక్, కళ్యాణి, జ్యోతి పొల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top