‘ఏబీఎన్‌ రాధాకృష్ణ చెప్పిన వారికే టీడీపీ సీట్లు, కోట్లు’

TDP KAPU Leaders Meets In Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పివారికే టీడీపీ సీట్లు, కోట్లు ఇచ్చారని ఆ పార్టీకి చెందిన కాపు ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించడానికి టీడీపీ కాపు ప్రజాప్రతినిధులు గురువారం కాకినాడలో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ టార్గెట్‌గా సాగినట్టు తెలుస్తోంది. లోకేశ్‌ తన సొంత సామాజిక వర్గానికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని నేతలు విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌లు కాపులను అవమానంగా చూసేవారని తెలిపారు.

ఎన్నికల సమయంలో నిధులు కూడా ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా ఇచ్చారని తెలిపారు. కాపు ప్రజా ప్రతినిధులను కలవడానికి కూడా సమయం ఇవ్వలేదన్నారు. సూటు బూటు వేసుకున్న వారికే లోకేశ్‌ ఎక్కువ సమయం కేటాయించే వారని మండిపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం నేతల కంటే కమ్మ సామాజిక వర్గం వారికే పార్టీ ఫండ్‌ ఎక్కువగా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top