చట్టానికి లోబడే ఫోన్ల ట్యాపింగ్‌!

Tapping phones under law! - Sakshi

దేశ భద్రత, నేర నిర్మూలనకే జరుపుతున్నాం

ప్రతిపక్షాల ఫిర్యాదుపై సీఈవోకు డీజీపీ వివరణ

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ భద్రత, నేరాల నిర్మూల న కోసం కట్టుదిట్టమైన విధివిధానాలకు లోబడే ఫోన్ల ట్యాపింగ్‌ జరుపుతున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా, అక్రమ పద్ధతుల ద్వారా ఫోన్ల ట్యాపింగ్‌కు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వ్యవస్థ లో అక్రమాల నిరోధానికి, తటస్థత (చెక్స్‌ అండ్‌ బ్యాలñ న్సెస్‌)ను కాపాడేందుకు చట్టబద్ధ ఏర్పాట్లున్నాయని తెలిపారు.

రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్‌ చేస్తోం దని, విపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీ సు శాఖ వాహనాల తనిఖీలు నిర్వహిస్తోందని మహా కూటమి నేతలు చేసిన ఫిర్యాదుపై వివరణ కోరుతూ డీజీపీకి సీఈవో రజత్‌కుమార్‌ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుకు సంబంధించి కవరిం గ్‌ లెటర్‌లో మినహా ఫిర్యాదు ప్రతిలో ఎక్కడా ఫోన్‌ ట్యాపింగ్‌ ప్రస్థావన లేదని డీజీపీ పేర్కొనడం గమనార్హం.

విపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారా.. లేదా అన్న అంశం పై డీజీపీ సూటిగా సమాధానం చెప్పని నేపథ్యంలో ఈ వివరణపై సంతృప్తి చెందారా అన్న విలేకరుల ప్రశ్నకు సీఈవో స్పందిం చారు. తనకు అన్ని రాజకీయ పార్టీలూ సమానమేనని, ఎవరి పట్ల వివక్ష లేదన్నారు. డీజీపీ వివరణపై సంతృప్తి చెందినట్లు తెలిపారు. ఫోన్ల ట్యాపింగ్‌ విషయంలో కేంద్ర హోంశాఖ నిబంధనలను అమలు చేస్తున్నామని పేర్కొనడం ద్వారా రాజకీయ పార్టీల నేతల ఫోన్లను ట్యాప్‌ చేయట్లేదని డీజీపీ పరోక్షంగా తెలిపారని అభిప్రాయపడ్డారు.

తనిఖీల్లో కక్ష సాధింపు లేదు..
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా విపక్ష పార్టీల నేతలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోదండరాం, ఎల్‌.రమణల వాహనాలను పోలీసులు తనిఖీ చేశారని వచ్చిన ఆరోపణలను డీజీపీ తోసిపుచ్చారు. ఇబ్రహీంపట్నం లోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వద్ద నిర్వహిం చిన వాహనాల తనిఖీల్లో టీఆర్‌ఎస్‌ మాజీ ఉప సర్పంచ్‌ పల్లె గోపాల్‌రావు కారు నుంచి రూ.27.35 లక్షలు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణకు  వాహన యజమానిని ఆదాయ పన్ను శాఖకు అప్పగించామని డీజీపీ నివేదించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top