వేములఘాట్‌ ప్రజలు ధైర్యవంతులు

tammineni veerabhadram on vemulaghat peoples

తమ్మినేని వీరభద్రం

తొగుట (దుబ్బాక): ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. సాగుభూమి, ఊరిని కాపాడుకునేందుకు పోరాడుతున్న వేములఘాట్‌ ప్రజలు ధైర్యవంతులని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను వ్యతిరేకిస్తూ వేములఘాట్‌ గ్రామస్తులు చేపట్టిన దీక్షలు మంగళవారానికి 500 రోజులకు చేరాయి.

దీక్షలకు సంఘీభావం ప్రకటించిన అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన 2013 చట్టాన్ని తుంగలో తొక్కి 123 జీఓ, 2016 చట్టంతో కేసీఆర్‌ సర్కార్‌ భూసేకరణ చేస్తోందన్నారు. 123 జీఓను హైకోర్టు కొట్టి వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో 5 లక్షల ఎకరాల సాగు భూమి కాజేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నా రు. డిజైన్‌ ప్లానింగ్‌ రిపోర్టు లేకుండా ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top