ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన సుష్మ

Sushma Swaraj vacate her official bungalow in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుష్మా స్వరాజ్‌ ప్రభుత్వ అధికారిక నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. గత ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా పనిచేసిన ఆమెకు ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్‌ లేన్‌లోని రెసిడెన్సీ-8ను కేటాయించిన విషయం తెలిసిందే. కాగా అనారోగ్యం కారణంగా సుష్మా స్వరాజ్‌ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి తాను ఆ బం‍గ్లాలో ఉండటం లేదని, అంతకు ముందు ఫోన్‌ నెంబర్లలో గాని, నివాసంలోగానీ అందుబాటులో ఉండనంటూ సుష్మా స్వరాజ్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. మరోవైపు సుష్మకు గవర్నర్‌ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top