లాలూ భార్య సంచలన వ్యాఖ్యలు

State And Central Government Want To Kill Lalu Yadav Rabri Devi Says - Sakshi

పట్నా : సార్వత్రిక ఎన్నికల వేళ బిహార్‌ మాజీ సీఎం, ఆర్‌జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాలును చంపడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకు తన కుమారుడు తేజస్వి యాదవ్‌ను వెళితే.. అనుమతి నిరాకరించి వెనక్కి పంపిచడం దారుణమన్నారు. లాలూకు ఏదైనా జరిగితే బీహర్‌, జార్ఖండ్‌ ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు.

‘అలా చేస్తే.. నా కొడుకును సీఎంని చేస్తానన్నాడు’

‘ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి లాలును చంపేందుకు కుట్ర చేస్తున్నారు. లాలూకు విషం ఇచ్చి చంపాలని చూస్తున్నారు. వాళ్లు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) అనుకుంటే లాలూ కుటుంబం మొత్తాన్ని చంపేస్తారు. కానీ నియంతృత్వాన్ని ఇక్కడ పనిచేయనీయం’ అని రబ్రీ దేవి పేర్కొన్నారు. కాగా పశుగ్రాస కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సుప్రీం కోర్టు బెయిల్‌ నిరాకరించిన విషయం తెలిసిందే. రాంచీలోని రిమ్స్‌లో వైద్య చికిత్స పొందుతున్న లాలూ.. ఆస్పత్రి వార్డు నుంచే ఆయన రాజకీయాలు చక్కబెడుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top