బీజేపీకి షాక్‌; శివసేన కీలక నిర్ణయం

ShivSena Decides To Contest 2019 Elections Alone - Sakshi

బీజేపీతో తెగదెంపులు.. 2019లో ఒంటరిగా పోటీ

జాతీయ కార్యవర్గ భేటీలో తీర్మానం

సాక్షి, ముంబై: శివసేన తన దీర్ఘకాలపు మిత్రపక్షమైన బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. కేంద్రంలో, మహారాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామిగా ఉన్న శివసేన.. 2019 సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. బీజేపీతో దోస్తీకి ఇక గుడ్‌బై చెప్పాలని నిశ్చయించింది. మంగళవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గం భేటీలో ఈ మేరకు తీర్మానం చేసింది.

ఇక, శివసేన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే నియమితులయ్యారు. ఇటు కేంద్రంలో, అటు మహారాష్ట్రలో బీజేపీతో శివసేన కలహాల కాపురాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై, కేంద్రంలోని మోదీ సర్కారుపై శివసేన తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో బీజేపీతో దోస్తీపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పటికే తెలిపారు. ఇది బీజేపీకి అల్టిమేటం కాదని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top