ఉద్యోగులను బాబు కించపరుస్తున్నారు: సజ్జల

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Comments Over Covid 19 - Sakshi

సాక్షి, తాడేపల్లి: మహమ్మారి కరోనా వైరస్‌కు సామాజిక దూరమే విరుగుడు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోందని.. దాని కారణంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్నారన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుజేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన... టీడీపీ నేతల తీరును దుయ్యబట్టారు.(‘ఢిల్లీ సమావేశం తర్వాతే పెరిగిన కరోనా కేసులు’)

‘‘విపత్కర పరిస్థితుల్లో కూడా టీడీపీ రాజకీయాలు చేస్తోంది. టీడీపీ నేతలు దిక్కుమాలిన, ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో దేశం మొత్తానికి తెలుసు. పసుపు కుంకుమ పేరుతో గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. అప్పుల భారం, వేలకోట్ల పెండింగ్ బిల్లులు రాష్ట్రానికి మిగిల్చారు. రాష్ట్రాన్ని లూటీ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ఇప్పుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రూ. 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు.

ఇక ఇప్పుడేమో డబ్బులు ఉండి కూడా ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని చంద్రబాబు మీడియా ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వ పెండింగ్ బిల్లలును కూడా ఈ ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లకు చెల్లింపు చేసింది రూ. 800 కోట్లు మాత్రమే. మేము బిల్లులు చెల్లించిన కాంట్రాక్టర్లు కూడా ఎవరికి దగ్గరో అందరికి తెలుసు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి జీతాల చెల్లింపు వాయిదా వేశాం. అత్యవసర సమయంలో ఉద్యోగులు వారి ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఉద్యోగులను కించపరిచే విధంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.('పచ్చడి మెతుకులు తిని అయినా బతుకుదాం')

విపత్కర పరిస్థితుల్లో దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటంబాలకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తుంది. ఖర్చులు బాగా పెరిగాయి. చంద్రబాబులా కోతలు పెట్టకుండా... అర్హులందరికీ సీఎం జగన్‌ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. కరోనా కేసులను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. దాచినా కరోనా వైరస్ దాగదు’’ అంటూ చంద్రబాబు, పచ్చమీడియా తీరుపై సజ్జల ధ్వజమెత్తారు. 

‘‘ఇప్పటికే వాలంటీర్లు ఇంటి ఇంటికి తిరిగి సర్వే చేస్తున్నారు. కరోనా వైరస్‌కు మందు లేదు. సామాజిక దూరం ఒక్కటే మందు. ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వారు ఉంటే ప్రభుత్వానికి సహకరించాలి. సామాజిక దూరం పాటించకపోవడం మనకు మనం ఇబ్బంది పడటమే. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు. ప్రతిరోజు సీఎం కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. రానున్న పది, పదిహేను రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, విద్యుత్ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు చేసే రాజకీయాలు మానుకోవాలని చురకలు అంటించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-06-2020
Jun 04, 2020, 11:00 IST
నాంపల్లి: నగరంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.20 వేల  చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు  తెలంగాణ ప్రెస్‌...
04-06-2020
Jun 04, 2020, 10:48 IST
వాషింగ్టన్‌: అమెరికా పోలీసుల చేతిలో నరహత్యకు గురైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ పూర్తి శవపరీక్ష నివేదికను వైద్యులు బుధవారం విడుదల...
04-06-2020
Jun 04, 2020, 10:30 IST
భారత్‌లో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
04-06-2020
Jun 04, 2020, 10:22 IST
సాక్షి,  ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ఆదాయాలను కోల్పోయిన పలు సంస్థలు ఉద్యోగాల కోత, వేతనాలు తగ్గింపు లాంటి నిర్ణయాలు...
04-06-2020
Jun 04, 2020, 09:57 IST
ఢిల్లీ : భార‌త ర‌క్ష‌ణ శాఖలో కరోనా క‌ల‌క‌లం రేగింది. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న ర‌క్ష‌ణశాఖ కార్య‌ద‌ర్శి...
04-06-2020
Jun 04, 2020, 09:32 IST
ఢిల్లీ: బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వచ్చేవారు ఖచ్చితంగా వారం రోజుల పాటు హోం...
04-06-2020
Jun 04, 2020, 09:00 IST
టి.వి. చూస్తున్నాడు. ఓ.కే. ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతున్నాడు. ఓ.కే.ఇంట్లో అటూ ఇటూ చక్కర్లు కొడుతున్నాడు.ఓ.కే.కాని ఫ్రెండ్స్‌ని కలవట్లేదు. ఫ్రెండ్స్‌తో ఆడే...
04-06-2020
Jun 04, 2020, 08:52 IST
జూబ్లీహిల్స్‌: చీకట్లను చీల్చుకుంటూ వచ్చే కిరణాలు వెండితెరపై పడగానే ఆ తెర ఒక్కసారిగా వెలుగులీనుతుంది. అదే వెండి తెర ఇప్పుడు...
04-06-2020
Jun 04, 2020, 08:43 IST
కోవిడ్‌-19 చికిత్సకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగించే దిశగా జరిగే క్లినికల్‌ ట్రయల్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది.
04-06-2020
Jun 04, 2020, 05:56 IST
సెయింట్‌ జాన్స్‌: వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం తాము ఇంగ్లండ్‌లో పర్యటించబోమని వెస్టిండీస్‌ ఆటగాళ్లు...
04-06-2020
Jun 04, 2020, 04:56 IST
న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దేశంలో వరుసగా నాలుగో రోజు 8 వేలకు...
04-06-2020
Jun 04, 2020, 04:44 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగు లక్షల మార్కును అధిగమించింది. మంగళవారం ఉదయం 9 గంటల...
04-06-2020
Jun 04, 2020, 04:33 IST
చైనాకు చెందిన ఎయిర్‌ చైనా, చైనా ఈస్ట్రర్స్‌ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్, జియామెన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు తమ దేశంలో...
04-06-2020
Jun 04, 2020, 04:16 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కల్లోలంతో  ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలన్న అంశంపై...
04-06-2020
Jun 04, 2020, 03:49 IST
‘‘తలసానిగారితో నాది 30ఏళ్ల అనుబంధం. రాజకీయంగా ఆయన ఎదిగినా మాతో రిలేషన్‌ మాత్రం అలానే ఉంది. సినీ కార్మికులకు అండగా...
04-06-2020
Jun 04, 2020, 03:41 IST
మనిషికీ మనిషికీ మధ్య మూడు సీట్ల దూరం ఉంటుందా? ఒకే కుటుంబానికి చెందినవారు వెళితే నాలుగు సీట్లు ఒకేచోట ఉంటాయా?...
04-06-2020
Jun 04, 2020, 02:43 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వైరస్‌ ఉధృతి ఏ...
04-06-2020
Jun 04, 2020, 02:33 IST
సాక్షి, హైదరాబాద్ ‌: నిమ్స్‌ ఆస్పత్రి కరోనా భయంతో వణికిపోతోంది. ఆస్పత్రి కార్డియాలజీ విభాగానికి చెందిన నలుగురు రెసిడెంట్‌ వైద్యులు,...
04-06-2020
Jun 04, 2020, 01:44 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా భయం.. లాక్‌డౌన్‌తో ఉపాధి కరవు.. వెరసి వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లారు. వారిపై ఆధారపడ్డ...
04-06-2020
Jun 04, 2020, 00:37 IST
లండన్‌: ఫార్ములావన్‌  (ఎఫ్‌1) రేసుల్లో పాల్గొనేందుకు వచ్చిన డ్రైవర్లలో ఎవరికైనా కరోనా సోకినా... పోటీ మాత్రం ఆగదని ఎఫ్‌1 సీఈఓ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top