ప్రతిపక్షాల వలలో ఆర్టీసీ నేతలు

RTC Leaders In The Opposition Trap Says Dayakar Rao - Sakshi

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌:ఆర్టీసీ యూనియన్‌ నాయకులు ప్రతిపక్షాల వలలో పడ్డారని, సంస్థను నాశనం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ కంకణం కట్టుకున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. ‘పండగ సమయంలో యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టాయి. ఆర్టీ సీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మా మేని ఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు. యూనియన్‌ నేత లు ప్రతిపక్షాల వలలో పడ్డారు. ఇదో రాజకీయ కుట్రగా అనిపిస్తోంది.

గతంలో ఆర్టీసీ కార్మికు లకు, వారు కూడా ఊహించనంతగా 44 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. బీజేపీ, కాంగ్రెస్‌ నేతల కుట్రలను ఆర్టీసీ కార్మి కులు అర్ధం చేసుకోవాలి. సంస్థకి గత ఐదేళ్లలో రూ. 3,303 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. సమైక్య రాష్ట్రంలో కేటాయించింది రూ. 1,600 కోట్లే. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని కేసీఆర్‌ ఎక్కడా చెప్పలేదు. ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయడంలేదు? దమ్ముంటే బీజేపీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రధానితో ప్రకటన ఇప్పించగలరా? ఆర్టీసీ కార్మికులకు నచ్చ చెప్పాల్సింది పోయి బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారు. ఆర్టీ సీని నాశనం చేయాలన్న కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రయత్నాలను సఫలం కానివ్వం’ అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top