
సాక్షి, హైదరాబాద్: గిరిజనులైన ఆదివాసీలు, లంబాడీలు పరస్పరం కొట్టుకుని చస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నీరో చక్రవర్తిలా వ్యవహారస్తూ సంబరాల్లో మునిగితేలుతున్నాడని మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్ విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయకపోవడమే గిరిజనుల్లో చిచ్చుకు ప్రధాన కారణమని అన్నారు. ఆదిలాబాద్‌లో జరుగుతున్న సంఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్టీల మధ్య చిచ్చుపెట్టిన కేసీఆర్ కపటనాటకాన్ని గిరిజనులు గుర్తించాలని రవీంద్రనాయక్ కోరారు.