‘హనుమాన్‌ జోలికి వస్తే మీ లంకను కాల్చేస్తాడు’ | Raj Babbar Warned BJP Don't Trouble Hanuman too Much Or Your Lanka Will Be On Fire | Sakshi
Sakshi News home page

Dec 25 2018 10:28 AM | Updated on Dec 25 2018 12:26 PM

Raj Babbar Warned BJP Don't Trouble Hanuman too Much Or Your Lanka Will Be On Fire - Sakshi

రాజ్‌ బబ్బర్‌

హనుమంతుడిని ఇబ్బంది పెట్టినందుకు బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిందని

జైపూర్‌ : హనుమంతుడిపై బీజేపీ నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజ్‌బ్బర్‌ హితవు పలికారు. లేకుంటే ఆ హనుమంతుడే బీజేపీ లంకను కాల్చేస్తాడని హెచ్చరించారు. రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హనమంతుడు దళితుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో హనమంతుడి కులం చర్చనీయాంశమైంది.

అదే బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ హనుమంతుడు బ్రాహ్మణుడంటే.. మరో ఎంపీ గిరిజనడన్నారు. ఇంకో బీజేపీ ఎమ్మెల్సీ ముస్లిం అంటే యూపీ మంత్రి జాట్‌ అన్నారు. ఇలా హనమంతుడి పేరును రాజకీయం చేయడంపై రాజ్‌బబ్బర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే హనుమంతుడిని ఇబ్బంది పెట్టినందుకు బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిందని, ఇలానే చేస్తే ఆ దేవుడు తన తోకతో బీజేపీ లంకను కాల్చేస్తాడని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement