రాహుల్‌ పర్యటన: జైపాల్‌ రెడ్డికి చుక్కెదురు! | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 13 2018 3:15 PM

Rahul Gandhi Reach To Shamshabad Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటన సందర్భంగా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీనియర్‌ నేత అయిన జైపాల్‌ రెడ్డిని సెక్యురిటీ సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించలేదు. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు పోలీసులు 10 మందికి మాత్రమే అనుమతిచ్చారు. ఈ జాబితాలో తెలంగాణ పీసీసీ జైపాల్‌ రెడ్డి పేరు పేర్కొనలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో హౌజ్‌ టెర్మినల్‌ వద్దే జైపాల్‌ రెడ్డి వేచి చూస్తున్నారు. ఆయనతో పాటు పోన్నాల లక్ష్మయ్య, మర్రిశశిధర్‌ రెడ్డి, వీహెచ్‌, జీవన్‌ రెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, రేవంత్‌ రెడ్డిలు బయటే వేయిట్‌ చేస్తున్నారు.

వీవీఐపీ టెర్మినల్‌కు 2 కిలోమీటర్ల దూరం వరకే పోలీసులు కాంగ్రెస్‌ నేతలకు అనుమతినిచ్చారు. రాహుల్‌ పర్యటన సందర్భంగా శంషాబాద్‌కు 500 బైక్‌లతో ర్యాలీ వెళ్లాలనుకున్న పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పట్టించుకోని కార్యకర్తలు బైక్‌ ర్యాలీ తీసే ప్రయత్నం చేశారు. దీంతో భారీగా ట్రాఫీక్‌ జామ్‌ అయింది. ఇక శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రాహుల్‌ గాంధీ చేరుకున్నారు. 

Advertisement
Advertisement