‘చట్టసభల్లో, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కావాలి’

R Krishnaiah Demands Reservation For BC In Promotions - Sakshi

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, న్యూఢిల్లీ : అన్ని రంగాల్లో జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం శనివారం జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ... ‘అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి.చట్టసభల్లో 14%, ఉద్యోగాల్లో 9%, వ్యాపార వాణిజ్య రంగాల్లో ఒక్క శాతం మాత్రమే బీసీలకు ప్రాతినిథ్యం ఉంది. బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా బీసీలకు తమ వాటా దక్కలేదు’  అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top