పాల్‌‘ట్రిక్స్‌’ : ప్రజాశాంతి పార్టీ పేర్ల గిమ్మిక్కు

Praja Shanti Party Gimmick in Candidates List - Sakshi

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న అభ్యర్థులతో నామినేషన్లు

ఇప్పటికే హెలికాప్టర్‌ బొమ్మ, ఒకే రంగులున్న జెండా

అనంతపురం అర్బన్‌: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్‌‘ట్రిక్స్‌’ ప్లే చేశాడు. నామినేషన్ల ప్రక్రియలో పేర్ల గిమ్మిక్కుకు పాల్పడ్డారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న వ్యక్తలను తమ పార్టీ అభ్యర్థులుగా పోటీలోకి దించారు. నామినేషన్ల పర్వం చివరి రోజున ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి తిరకాసుకు పాల్పడ్డారు. ఇందులో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గానికి పగడి వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్‌ వేశారు. వాస్తవంగా ఇతను రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కావడం గమనార్హం. ఈ తతంగం చూస్తే తెలుగుదేశం పార్టీ, ప్రజాశాంతి పార్టీల మధ్య అంతర్గత బంధం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్‌ గుర్తును తీసుకుంది. హెలికాప్టర్‌ రెక్కలు వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ గుర్తును పోలి ఉన్నాయి. ఇక ఆ పార్టీ జెండా రంగుల విషయానికొస్తే వైఎస్సార్‌సీపీ జెండా రంగులను పోలి ఉండటం గమనార్హం.

  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న ప్రజాశాంతి అభ్యర్థులు
నియోజకవర్గం     వైఎస్సార్‌సీపీ అభ్యర్థి    ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి
రాయదుర్గం  కాపు రామచంద్రారెడ్డి   ఉండాల రామచంద్రారెడ్డి
ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి కె.విశ్వనాథరెడ్డి
అనంతపురం అర్బన్‌  అనంత వెంకటరామిరెడ్డి  పగడి వెంకటరామిరెడ్డి
కళ్యాణదుర్గం ఉషాశ్రీచరణ్‌ ఉషారాణి నేసే
రాప్తాడు  తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డి.ప్రకాష్‌    
పెనుకొండ  ఎం.శంకర్‌నారాయణ ఎస్‌.శంకర్‌నారాయణ
ధర్మవరం   కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి  పెద్దిరెడ్డిగారి వెంకటరామిరెడ్డి
 కదిరి  సిద్దారెడ్డి    సన్నక సిద్దారెడ్డి

     
ఇక, గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేరు నంబూరు శంకరరావు కాగా.. ఇక్కడ ప్రజాశాంతిపార్టీ నంబూరి శంకరరావు అనే పేరు గల వ్యక్తిని నిలబెట్టింది.
           

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top