‘ఆ పదవికి ఎమ్మెల్యే రూ.50 లక్షలు అడిగారు’ | AS Posetti Comments on MLA Ganesh Guptha | Sakshi
Sakshi News home page

‘ఆ పదవికి ఎమ్మెల్యే రూ.50 లక్షలు అడిగారు’

Jul 18 2018 1:57 AM | Updated on Jul 18 2018 1:57 AM

AS Posetti Comments on MLA Ganesh Guptha - Sakshi

నిజామాబాద్‌ అర్బన్‌: రూ.50 లక్షలు ఇస్తే నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఇప్పిస్తానని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా డిమాండ్‌ చేశారని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్‌ పోశెట్టి ఆరోపించారు. మంగళవారం నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

డబ్బులు డిమాండ్‌ చేయలేదని ఆలయం మెట్లు ఎక్కి ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. అసలు తాను చేసిన ఆరోపణలు వాస్తవం కాదని నిరూపించే దమ్ము ఎమ్మెల్యేకు ఉందా అని సవాలు విసిరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement