తల్లడిల్లిన గుండె | People Support To Ys Jagan In Praja sankalpa yatra | Sakshi
Sakshi News home page

తల్లడిల్లిన గుండె

May 2 2018 8:11 AM | Updated on Jul 6 2018 2:54 PM

People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మచిలీపట్నంలో జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడుస్తున్న జన సందోహంలో ఓ భాగం(చిట్టిగూడూరులో చెల్లెమ్మ బాధ ఆలకిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి)

గుండె తల్లడిల్లుతోందిదౌర్జన్యాలు, దాడులు విని..మనసు విలవిలలాడుతోందిఆక్రమణలు, అన్యాక్రాంతాలు తెలిసి...గొంతు మూగబోతోందిదాడులు, ఆగడాలు విని...కళ్లు చెమర్చుతున్నాయిఅక్కచెల్లెళ్ల దుర్భర బతుకులు చూసి....రాక్షసత్వం రాజ్యమేలటం చూసి...వేదనలు, ఆవేదనలు, విన్నపాలుఒకటా రెండా...వేనవేలు...పాదయాత్ర పొడవునా..దుష్టపాలకుల దాష్టీకాలకుచరమగీతం పాడాలనిరాజన్న స్వర్ణయుగం కావాలనిజననేత ఎదుట బాధితులుబారులుతీరుతున్నారు.

సాక్షి, అమరావతిబ్యూరో : దుర్భర జీవనం గడుపుతున్న అక్కాచెల్లెమ్మలను  చూసి జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తల్లడిల్లిపోయారు. మాజీ సైనికులకు కేటాయించిన స్థలాన్ని ఇవ్వకుండా మంత్రి కొల్లు రవీంద్రే అడ్డుపడుతుండటంపై మండిపడ్డారు.  తమవారి కోసం కాంట్రాక్టు ఉద్యోగులను వారి ఉద్యోగాలు మానేయాలని బెదిరిస్తున్న టీడీపీ నేతల దౌర్జన్యంపై ఆగ్రహించారు. ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు కాక అల్లాడుతున్న పేదల కష్టం చూసి చలించిపోయారు. రోల్డ్‌గోల్డ్‌ పరిశ్రమ, ఆటోమొబైల్‌ రంగం వంటి సంఘటిత కార్మికుల బతుకు బండి పట్టాలు తప్పుతోందని తెలుసుకుని విస్తుపోయారు.

మన ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు...
ఇలా అందరికీ భవితపై భరోసానిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రను నిర్వహించారు. 150వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. మేడే సందర్భంగా  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గూడూరు మండలం  పర్ణశాల వద్ద తాను బస చేసిన శిబిరం వద్ద మంగళవారం ఉదయం జెండా ఆవిష్కరించారు. అనంతరం   ఉదయం 8.40 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి చిట్టిగూడూరు, గూడూరు, రామరాజుపల్లి క్రాస్, సుల్తాన్‌ నగరం మీదుగా మచిలీపట్నం వరకు పాదయాత్ర నిర్వహించారు. మధ్యాహ్న విరామ సమయంలో  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని వేదపండితులు ఆశీర్వదించారు.

స్థలాలు కేటాయించకుండామంత్రే అడ్డుపడుతున్నారు....
దివంగత మహానేత వైఎస్సార్‌ ప్రభుత్వం 2007లో  220 మందికి కేటాయించిన భూమిని దక్కనీయకుండా మంత్రి కొల్లు రవీంద్ర అడ్డుపడుతున్నారని మాజీ సైనికులు ఫిర్యాదు చేశారు. దీనిపై వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ మంత్రి కొల్లు రవీంద్ర దందాను అడ్డుకుని  మాజీ సైనికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  మహానేత వైఎస్సార్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన 300 ఇళ్ల పట్టాలకు కూడా భూమి అప్పగించడం లేదని గూడూరుకు చెందిన తోట వీరరాఘవమ్మ, జ్యోతి వెంకటేశ్వరమ్మ, దుర్గా కోటేశ్వరమ్మ జననేతకు చెప్పుకుని వాపోయారు. వారికి న్యాయం చేస్తామని అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. 20 ఏళ్లుగా గ్రామంలో ఉంటున్నా ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదని జెమినిరామవారిపాలెం గ్రామస్తులు  జననేత దృష్టికి తీసుకువెళ్లారు. 

ఆరోగ్యశ్రీ గాడితప్పింది...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆపరేషన్‌ చేయాలంటే ఆరోగ్యశ్రీ పథకం వర్తించలేదని ఎస్‌.ఎన్‌.గొల్లపాలెంకు చెందిన యార్లగడ్డ జగన్మోహన్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను రూ.3 లక్షలు ఖర్చుచేసుకోవాల్సి వచ్చిందన్నారు. క్యాన్సర్‌ పరీక్షలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తించడం లేదని విజయవాడకు చెందిన వి.జ్యోతి  తెలిపారు.

కాంట్రాక్టు ఉద్యోగుల కష్టాలు తీర్చండి సార్‌...
తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం, వైద్య శాఖ, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆయన్ని కలిసి తమ ఆవేదన వెళ్లగక్కారు.

కార్మికులను ఆదుకోండయ్యా...
మచిలీపట్నం కేంద్రంగా 130 ఏళ్లుగా నిర్వహిస్తున్న రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాల పరిశ్రమను ఆదుకోవాలని పరిశ్రమ ప్రతినిధులు కోరారు. మహానేత వైఎస్సార్‌ హయాంలో నెలకొల్పిన ఇమిటేషన్‌ జ్యుయలరీ పార్క్‌ను మరింత అభివృద్ధి చేయాలన్నారు.తప్పకుండా తగిన రాయితీలు, వసతులూ కల్పించి ప్రోత్సహిస్తామని వై.ఎస్‌.జగన్‌ హామీ ఇచ్చారు.

ఆదుకోండయ్యా...
మురికి, చెత్తాచెదారం మధ్య దుర్భర పరిస్థితుల్లో బతుకు వెళ్లదీస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని పఠాన్‌పేటకు చెందిన మíßహిళలు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గుక్కెడు నీటి కోసం కూడా నానా యాతన పడుతున్నామని గూడూరు మండలానికి చెందిన మహిళలు వాపోయారు. ఇంతటి అనారోగ్యకర పరిస్థితుల్లో పేదలు మగ్గేలా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి  మానవత్వం లేదని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement