సీఎం జగన్‌కు కృతజ్ఞతలు : రవీంద్రబాబు

Pandula Ravindra Babu Thanks To Ys Jagan - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : పేద ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో అవసరమని వైఎస్సార్‌సీపీ నాయకుడు పండుల రవీంద్రబాబు అన్నారు. తనను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో అనేక మంది హామీలిస్తారు.. అధికారంలోకి రాగానే మర్చిపోతారు. కానీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏడాదిలోపే అమలు చేశారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా అని సీఎం జగన్‌ను చూసి షాక్‌ అయ్యాం. 

ఏడాదిలోగా నవరత్నాలను అమలు చేసి సీఎం జగన్‌ గ్రేట్‌ అనిపించుకున్నారు. గత పదేళ్లుగా బడుగు, బలహీన వర్గాలు అనాథలుగా ఉన్నారు. వారికి సీఎం వైఎస్‌ జగన్‌ అండగా నిలబడ్డారు’ అని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top