‘మోదీలను ఓడించేందుకు ప్రజలు సిద్ధం’

Narayana reddy and mallu ravi comments over modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని చిన్నమోదీ, కేంద్రంలోని పెద్దమోదీ లను ఓడించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లురవి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఇద్దరు నియంతలు పాలిస్తున్నారని విమర్శించారు. వీరిని ఎప్పుడు ఓడించాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, తెలంగాణలో వచ్చే నిశ్శబ్ద విప్లవంలో 80–85 స్థానాలు గెలవడం ఖాయమని చెప్పారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top