లోకేశా.. ఏంటా మా(మం)టలు..!

Nara Lokesh Critics Election Commission Of India - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలు, మీడియా రిపోర్టులు, ఎగ్జిట్‌ ఫలితాలు ఘంటాపథంగా చెప్పడంతో.. తండ్రి చంద్రబాబు, తనయుడు లోకేశ్‌బాబుకు ఒళ్ళు మండిపోతున్నట్టున్నాయి. కానీ బయటపడడం లేదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. పార్టీ కార్యకర్తల్లో ‘ధైర్యం’ నింపడానికి.. బిత్తరపోయిన పచ్చ మీడియాకు కొన్ని వార్తలు విదల్చడానికి సరికొత్త నాటకాలకు తెర తీశారు. ఎన్నికల సంఘంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈసీ పక్షపాతంతో వ్యవహరిస్తోందని, దేశ ఎన్నికల వ్యవస్థ భ్రష్టుపట్టిందని కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు, పలువురు విపక్ష నేతల్ని వెంటేసుకుని తరచూ ఈసీని కలిసి వినతులు సమర్పించారు.
(లోకేష్‌ బాబు గెలవటం డౌటే!)

ఇక కౌంటింగ్‌కు ఒకరోజు మాత్రమే ఉందనగా..‘తొలుత వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించిన తర్వాతనే ఈవీఎంలలోని ఓట్లను లెక్కించాలి’ అని ఈసీకి కొత్త మార్గదర్శకాలు ఇవ్వజూపిన బాబుకు గట్టిషాక్‌ తగిలింది. కౌంటింగ్‌ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఈసీ స్పష్టం చేసింది. ‘బాబు’కు తగిలిన షాక్‌తో షాక్‌తిన్న లోకేశ్‌.. ఈసీ నిర్ణయం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటిదినం అని ట్వీటారు. ‘ఈసీ పారదర్శకంగా పనిచేయాలనే మా న్యాయమైన డిమాండ్లను ఏ కారణం లేకుండా తిరస్కరించారు’అని భోరుమంటున్నారు. ఇక మంగళగిరిలో పోటీ చేస్తున్న లోకేశ్‌ గెలవటం డౌటేనని ఆరా పోస్ట్‌ పోల్‌ సర్వే వెల్లడించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top