ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబే బాధ్యత వహించాలి.. | MP Mekapati Rajamohan Reddy Slams To CM Chandrababu | Sakshi
Sakshi News home page

ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబే బాధ్యత వహించాలి..

Apr 18 2018 10:20 PM | Updated on Aug 14 2018 11:26 AM

MP Mekapati Rajamohan Reddy Slams To CM Chandrababu - Sakshi

సాక్షి, నూజివీడు : నేటికి ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందంటే వైఎస్‌ జగన్‌ పోరాటమే అని వైఎస్సార్‌ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయన్ని రాష్ట్రపతిని కలిసి వివరించామని ఎంపీ చెప్పారు. పాదయాత్ర శిబిరం వద్ద ఎంపీలు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలను ఎంపీలు వైఎస్‌ జగన్‌కు వివరించారు. అనంతరం ఎంపీ మేకపాటి మీడియాతో మాట్లాడుతూ. 25మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేసి ఉంటే దేశం మొత్తం చర్చ జరిగేదని ఎంపీ అన్నారు.

సీఎం చంద్రబాబు తీరుపై ఎంపీ మేకపాటి మండిపడ్డారు. ‘ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలను చంద్రబాబు ఇంకా చేస్తునే ఉన్నారు. నిరాహార దీక్ష చేసి మరోసారి మభ్యపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయనికి ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబే బాధ్యత వహించాలి. ప్రత్యేక హోదా వస్తే అందరూ వచ్చి ఇక్కడే పరిశ్రమలు పెట్టేవారని’ మంత్రి పేర్కొన్నారు.

అంతేకాక నిరుద్యోగులందరికి ఉద్యోగాలు వచ్చేవని మంత్రి తెలిపారు. అవన్నీ విషయాలను చంద్రబాబు పక్కాన పెట్టి.. ప్యాకేజీకి ఒప్పుకున్నారని మేకపాటి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ నేతలతో చర్చించి ఈ నెల 22న భవిష్యత్‌ కార్యచరణ నిర్ణయిస్తామని ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement